Uncategorized
హనుమకొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి
హనుమకొండ పోలీస్ స్టేషన్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో సిపి ముచ్చటించారు. అనంతరం సిసి కెమెరాల పనితీరు, సిసిటీఎన్ఎస్ రిసెప్షన్ పనితీరు ను అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రజలతో బాధ్యతయుతంగా వ్యవహారించాలని, విధి నిర్వహణ అలసత్వం వహించిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, సిబ్బంది కి సూచించారు.




